Friday, January 14, 2011

పరమ వీరచక్ర :

ధియేటర్ లోకి వెళ్ళగానే డోర్ దగ్గరే "ఈ సినిమా పెద్ద రాడ్ " అని చెప్పారు .
మూడవ రోజు , మూడవ షో .. జనాలు లేరు అంటే ఎవ్వరికైనా అర్ధం అవుతుంది
PVC(పరమ వీరచక్ర) ఎంతటి విజయం సాధించిందో ....

ఇక కథలోకి వెళ్తే !!!!!!!!!!!!!!!!!!!!
NTR బొబ్బిలిపులి తో స్టార్ట్ అవుతుంది , జయసుధ ఏడుస్తుంది . ఎందుకో నేను చూడలేక పోయాను .
దర్శకత్వం దాసరి అనే పేరుతో సగటు అభిమాని ఆశలు ఆవిరి అయ్యే సంగటన వర్ణనాతీతం .
రావణబ్రహ్మ , రాముడితో యుద్ధానికి వెళ్తుంటే , హరితి ఇస్తుండగా దీపం ఆవిరై పోతుంది ...
ఇదంతా చూసి ఏదో ఫాంటసి మూవీ అనుకుంటే పొరపాటు ..
మన బాలయ్య & దాసరి సినిమా లో సినిమా చూపిస్తారు మనకు .
చక్రధర్ (బాలయ్య పేరు ) , వాళ్ళ అమ్మ (జయసుధ ) కి ఇష్టం లేకున్నా సినిమా లు చేస్తుంటాడు .
హీరొయిన్ (షీలా )అవసరం లేకున్నా అప్పుడప్పుడు వచ్చి ఆనందింప చేసి వెళ్తుంది (ఎవ్వరిని ? అని మాత్రం అడగ వద్దు ).
సినిమా ఎటువేల్తుంది రా అనుకునే సమయం లో కొమరం భీమ్(తెలంగాణా యోధుడు ) పాత్రతో చక్రధర్ కి ఇంకో ఆఫర్ వస్తుంది .
ఆయన జీవీత చరిత్ర ఇంకో 15 నిముషాలు . ఏదో సీరియస్ గా వెళ్తున్న మూవీ కి కామన్ సెన్స్ లేని కామెడీ తో సినిమా నే కామెడీ
చేసిన దర్శక రత్న కి జోహార్ ,
మిలటరీ వాళ్ళు చక్రధర్ తో మూవీ తీయాలని ఒక కథతో ముందుకు వస్తారు. కథలో హీరో ఒక మిలటరీ మేజర్ , పేరు జయ సిన్హా (Jay sinha).

Jay Sinha కథ:(flash back)
అలుపురేగని యోధుడు ,ఆమిష పటేల్ మొగుడు , మిలటరీ మేజరు కథలో భాగంగా ఒక సెంట్రల్ మినిస్టర్ నీ కొడతాడు .
జార్కండ్ లో తన కంద బలం చూపు మాజీ మంత్రి కొడుకును అడ్డం వచ్చిన అయ్యాను కొడతాడు .
పై సందర్బం లో కొన్ని బాలయ్య brand డైలాగ్స్ ..
  • నేను యాక్షన్ మొదలు పెడితే , రియాక్షన్ ఇవ్వాలని చూడొద్దు .
  • నన్ను కొడితే చస్తావు , నేను కొడితే చస్తావు .
ఇక ఫైటింగ్ విషయానికి వస్తే , మనుషులతో ఫుట్ బాల్ ఆడుతూ , వాళ్ళని విష్ణు చక్రం ళా తిప్పుతూ
తూపాన్ వస్తే ఎగిరేల కొట్టడం , తంతే సుమో doors విరిగి పడటం ... చెప్పుకుంటూ పోతే చేంతాడు అంత
చెప్తే ఉరేసుకునేంత ... దాచుకుంటే కడుపు మంటలు , చెప్తే వినేవారి తంటాలు .

after flash back:

చక్రధర్ : కథ భాగుంది అని సినిమా తీయటానికి ఒప్పుకుంటాడు .

The Twist(మెలిక ):
జయ సింహ, నిజంగా బ్రతికే ఉన్న ఒక అర్మి మెజార్ , కొందఱు దేశ ద్రోహులు కుట్రలో చిక్కుకుని ఇతను దేశ ద్రోహిగా
ముద్ర పడి, చివరకు ఒక ఎటాక్ లో అందరిని కోల్పోయి , తాను కోమా లో కి వెళ్తాడు .
ఇప్పుడు ఆ దేశాద్రోహులను పట్టుకోవటానికి మన హీరో చక్రధర్ జయ సింహ అవతారం ఎత్తుతాడు .

మల్లి బాలయ్య ఫైట్స్ మొదలు, చివరగా అందరికి తెలిసిన ముగింపు విలన్స్ నీ చంపేసి ,
రెండు బారి డైలాగ్స్ వదిలి , చనిపోయిన జయ సింహ కి పరమ వీర చక్ర బిరుదు ఇచ్చేలా
ప్రభుత్వం నీ వప్పించి .. సెలవు తీసుకుంటాడు ...

Comments: 150 వ సినిమా తీస్తున్న దాసరి కి రాజకీయం దెబ్బకి దర్శకత్వం ఎలా చేయాలో
మరచిపోయాడేమో అనేలా తల తోక లేకుండా , ఆయన మార్క్ ఎక్కడ లేకుండా
అనవసర కామెడీ , లాజిక్ లేని సన్నివేశాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎం చెప్పాలో
తెలియన్తాల తీసాడు ...



2 comments:

  1. ha haaaa... nuvvu maree ra sravan... mudo roju mudo show ki janalu vuntaru ani expect cheyatam really funnyyy....

    as usaul ga balayya malli neerupinchukunnadu..sense leni story lu, vishayam leni dialogsuu... logic leni climaxxxxuu.....

    thank god nuvvu nannu pilavaledu movie ki rammani..

    ReplyDelete