Friday, April 29, 2011

నేను రాక్షసి .......

నేను రాక్షసి .......
ఇలియానా 'I hate men, I hate my life' అంటూ ఉరి వేసుకోవటం తో సినిమా మొదలు .
ఇక కథ లోకి వెళ్తే ...
రానా (అభి) ఒక ప్రొఫెషనల్ షూటర్ & కిల్లెర్ . డబ్బులు ఇచ్చి ,ఫోటో MMS చేస్తే ఎవరినైనా చంపేస్తాడు .
ఇలియానా (మీనాక్షి) ఒక కాఫీ కేఫ్ లో working women.
అభి మీనాక్షి నీ స్మశానంలో చూసినప్పటి నుండి పడితినమ్మో పడితినమ్మో అంటూ ప్రేమలో పడిపోతాడు .
ఫోటో పంపితే చంపుకుంటూ వెళ్తాడు .
ఇదిలా ఉండగా , ఎవరో ఆత్మహత్య చేసుకునే వాళ్ళని చనిపోయే ముందు వీడియో తిసి youtube లో పెడుతూ వుంటారు , అది ఎవరో కనుక్కోవటానికి పోలీసులు ట్రై చేస్తూ ఉంటారు.
అభి వల్ల అమ్మ చనిపోవటం తో వీడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుని ఆ వీడియో తీసే వ్యక్తికి పిలుస్తాడు .
అభి కత్తితో పొడుచుకునే టైం కి వీడియో తీసేది మీనాక్షి అని తెలిసి బ్రతకాలి అనుకుంటాడు .
కాని మీనాక్షి మాత్రం బ్రతికించడం నా పని కాదు అని వెళ్ళిపోతుంది .
అభి హీరో కదా బ్రతికోపోతడు .
చివరికి మీనాక్షి పోలీసులకి దొరికిపోతుంది , కాని అభి మీనాక్షి నీ కాపాడి , అందరికి దూరంగా వెళ్దాం అని చెప్పి వెనిస్ వెళ్తారు. అభి నీ చంపటానికి ఒక రౌడి వెనిస్ వస్తాడు , అభి వాళ్ళ అమ్మ ,నాన్నని చంపిన రౌడి , వెనిస్ కి వచ్చిన రౌడి ఒక్కడే అని తెలిసి వాడిని చంపేస్తాడు.
మీనాక్షి ఆత్మహత్య చేసుకోవాల్సిన రోజు రానే వస్తుంది (అభి కి ముందు గానే తాను చనిపోయే సంగతి చెప్తుంది ).
మీనాక్షి ఎందుకు చనిపోవాలి అనుకుంటుంది , తన అక్క కి (సినిమా మొదట్లో ఉరి వేసుకునే ఇలియానా , మీనాక్షి అక్క ), నాన్న కి జరిగిన అన్యాయం చెప్పి తను కత్తితో పోడుచుకుంటుంది , అభి కూడా పిస్టల్ తో షూట్ చేసుకుని పడిపోతాడు . పోలీసులు వీళ్ళని కాపాడి , ఆత్మహత్య చేసుకునే వీడియో తీసినందుకు మినక్షికి 18 నెలలు శిక్ష వేసి వదిలేస్తారు .
అభి మీనాక్షి కలిసి మిగతా జీవితం హ్యాపీగా వుంటారు .
సినిమా లో ఆత్మహత్య చేసుకునే వాళ్ళ భాధలు ఎలా ఉంటాయో చూపించడం ప్రధాన నేపధ్యంగా తెరకెక్కించాడు .కాని చెత్త కామెడీ తో , ఇంకా వేరే అనవసరపు సన్నీ వేషాలతో సినిమా నీ కాస్త కంపు చేసాడు అని మాత్రం చెప్పగలను .

Friday, April 22, 2011

Mr.Perfect

Mr.Perfect :

మంచి సినిమా అనటంలో నాకు ఎలాంటి సందేహం లేదు.
నిజమైన ప్రేమ , బంధాలు అనుబంధాలు అనే సారాంశం తో ఎండాకాలం ఎంజాయ్ చేయటానికి
ఒక మంచి సినిమా Mr.Perfect .
కథలోకి వెళ్తే :
విక్కీ (ప్రభాస్) ఆస్ట్రేలియా లో వుంటూ తన స్నేహితులతో ఒక టీం స్టార్ట్ చేసి గేమ్స్ ప్రోగ్రాం చేయటం ,
వాటితో ఎలాగైనా ఒక మంచి కంపెనీతో కలిసి లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనే డ్రీంతో కాలం తనకు నచ్చే విధంగా
గడిపేసే వ్యక్తి .
ప్రియ (కాజోల్ ) పల్లెటూరు లో పెరిగిన స్వచమైన తెలుగు అమ్మాయి , ఒక అనాధ వసతి గృహం నడుపుతూ
నలుగురికి సహాయపడే మనసు కలది .
విక్కి ,ప్రియ చిన్ననాటి శత్రువులు. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలనీ డిసైడ్ చేస్తారు .
మొదట్లో ఒకరికొకరు ఎడిపించుకుంటూ , చివరికి అర్ధం చేసుకుని మంచి ఫ్రెండ్స్ , తర్వాత పెళ్ళికి ఓకే అనేవరకు వస్తారు . నిశ్చితార్ధం డేట్ ఫిక్స్ చేసే టైం కి విక్కీ ,ప్రియకి తను కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు.

విక్కి ఆస్ట్రేలియా వెళ్ళగానే ఒక చాక్లెట్ కంపెనీ కాంటెస్ట్ లో విన్నర్ అని కాల్ వస్తుంది (విక్కి ఇండియా కి వచ్చే ముందు ఒక కాంటెస్ట్ లో పేరు ఇచ్చి వస్తాడు .. ) , విక్కి తో పాటు ఇంకో విన్నర్ మ్యాగి (తాప్సి) .
మ్యాగి : విక్కి లాగే తనకు నచ్చేది చేసే మనస్తత్వం కలిగిన అమ్మాయి.
కాంటెస్ట్ వల్ల విక్కి, మ్యాగి ఒకరినొకరు కలుసుని, పెళ్ళిచేసుకోవాలని డిసైడ్ చేసుకుంటారు .
మ్యాగి వాళ్ళ నాన్న (ప్రకాష్ రాజ్ ) అడ్డుపడి , ఒక పందెం పెడతాడు (బొమ్మరిల్లు సినిమా లో లాగ ), నాలుగు రోజులు మా ఇంటికి వచ్చి తన పెద్ద కూతురు పెళ్ళిలో వాళ్ళతో గడిపి వెళ్ళు .. మా చుట్టాలు అందరు ఒప్పుకుంటే నాకు ఓకే అని .
విక్కి మ్యాగి పందానికి రెడీ అవుతారు ..
అనుకోకుండా ఇదే పెళ్ళికి ప్రియ కూడా వస్తుంది . పందెం గడువు ముగిసే సరికి అందరు విక్కి,మ్యాగి ప్రేమని ఒప్పుకుంటారు . కాని పందెం సమయం లో విక్కి కి నిజమైన ప్రేమ ఎక్కడుందో , బంధాలు అనుబంధాలు ఎలా ఉంటాయో తెలిసి ,ప్రియానే తన గమ్యం అని తెలుసుకుని ఇండియా వెళ్లిపోతాడు .
మ్యాగి కూడా తన ఆలోచన మార్చుకుని అందరికోసం తను మారుతుంది .

పైన చెప్పిన కథే కాకుండా మధ్యలో మంచి కామెడీ తో Mr.Perfect ఒక మంచి సినిమా అనిపించుకుంది.
మీకు నచ్చుతుందని ఆశిస్తూ ...........................................................................
....................................................................................శ్రావ్యం .......................

Saturday, February 5, 2011

Wanted

కథలో పస కాస్త ఉంది , దాన్ని కూడా అనవసరపు ప్రయోగాలతో కంపు చేసారు .
పనిలేక పాటలు , కొత్తదనం లేని కొట్లాటలు .. ఎప్పుడో చూసిన కామెడీ సీన్ లు ,
పోకిరి సాఫ్ట్వేర్ బ్రాహ్మి, ఈ మూవీ లో గవర్నమెంట్ బ్రాహ్మి , అదే పోకిరి కామెడీ ట్రాక్ కాస్త విభిన్నంగా ..
కిక్ లో చూసిన పేరెంట్స్ , వాంటెడ్ లో వున్నారు .. End లో కంపు చేసాడు ... ఇయ్ల సినిమా చూస్తుంత సేపు వేరే మూవీ కి వెళ్తే
భాగుండు అనేలా చేసాడు..
దేవుడి దయ వాళ్ళ మొదటి 10 mins చూడలేదు ... వెళ్లేసరికి చూసిన కథ:
హీరో రాంబాబు(గోపిచంద్) , ఒక బేవార్స్ పనికట్టుకుని వీడి అమ్మానాన్న లే పనికిమాలిన వాడిగా పెంచుతారు ..
హీరో కనుక fight లు భాగానే చేస్తాడు.
హీరోయిన్ నందిని ఒక డాక్టర్ , ప్రతిరోజు ఒకే పీడకల (చంపేస్త , చంపేస్త అని ).
రాంబాబు అమ్మ జయసుధకి గుండెపోటు, నందిని కాపాడుతుంది .. రాంబాబుకి నందిని మీద మనసై
వెంటపడటం స్టార్ట్ చేస్తాడు ....
ఒక రోజు ,, ఒక సందర్భం లో నీకోసం చవమంటావా అని అంటే నందిని ఒకరిని చంపుతావా అని అంటుంది...
పనిలేని రాంబాబు సరే అని చంపడం స్టార్ట్ చేస్తాడు .

ఎవరిని?
నందిని గతంలోకి వెళ్తే :
నాజార్ , నందిని కి నాన్న , సేక్రేట్ పోలీసు . ప్రకాష్ రాజ్ (గంజాయి గ్యాంగ్ పెద్ద ) దగ్గర పని చేస్తూ వల్లనే చంపటానికి ప్లాన్ చేసి , కుదరక
వాడి కొడుకుని చంపేస్తాడు .. విషయం తెల్సిన బసవరాజ్ ( ప్రకాష్ రాజ్) నందిని కుటుంబం లో అందరిని చంపేస్తాడు . నందిని మాత్రం బ్రతుకుంది ..
నందిని పగ తిర్చుకోవాటానికి రాంబాబునీ ఎన్నుకుని , వాడిని తన వెంట పడేలా చేసుకుంటుంది .
చివరికి ఎలాగు ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు..
కలిసే పగ తీర్చుకుంటారు ..

Sunday, January 16, 2011

ఆరంజ్

నిజమైన ప్రేమను కొద్ధిరోజులైన ఆస్వాదించాలి అనే తపనతో హీరో (రామ్ ),
ప్రేమను లైఫ్ లాంగ్ అనుభవించాలి అని హీరొయిన్ (జాను ).

సినిమా రీల్ లోకి వస్తే !!! జాను (జెనిలియా ) కరెంటు షాక్ కొట్టినట్టు ఊగే సమయంలో
హీరో గుండెలో తనపై లవ్ కరెంటు స్టార్ట్ అవుతుంది. జాను మాత్రం చిట్స్ వేసి ఒకడిని సెలక్ట్ చేసి
సెటిల్ అవ్వాలి అనుకుంటుంది . రామ్ మాత్రం తనని నిజంగా కొద్దికాలం మాత్రమే ప్రేమించాలి అనుకుంటాడు .
అది నచ్చని జాను మాత్రం అతన్ని అసహ్యిన్చుకోలేక ,అతను చూపే ప్రేమను తిరిగి ప్రేమించలేక ప్రేమిస్తూ
తన ప్రేమని భరిస్తూ , నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకుని అది రామ్ మాత్రమే ఇవ్వగలడు అని తనని
నిజంగానే ప్రేమిస్తుంది, కాని తనకి ఆ ప్రేమ జీవితాంతం కావాలి అని అడుగుతుంది. రామ్ మాత్రం దానికి ఒప్పుకోడు.
ఒక చిన్న పరిచయం రామ్ ఆలోచనల్లో మార్పును తీసుకు వస్తాయి. ప్రేమించడం లో ప్రేమే మిగలాలి కాని కారణాలు
కాదు అని తెలుసుకుంటాడు. కపటం లేని జాను ప్రేమని పొందాలని ట్రై చేస్తూ ఉంటాడు.ఇప్పుడు జాను ట్రాక్ మర్చి .
రామ్ ప్రేమని ఒప్పుకోదు నిజమైన ప్రేమే అని నిరూపించటానికి రామ్ పడే అవస్థ అంత ఇంత కాదు , చివరికి
తనకు ఇష్టమైన కొన్నింటిని రామ్ తన ప్రేమ కోసం వదిలి వేసి జాను కలుస్తాడు.

ఏమైంది ఈవేళా!!!!

ఒక మంచి సందేశంతో , నేటి యువతని , టీనేజి లో వున్న ప్రతి ఒక్కరికి ఒక పాఠంగా ,జీవితం లో కొన్ని బలహీన క్షణలా బారిన పడకుండ జాగ్రత్తలు తెలిపే సినిమా ..

కథలోకి వస్తే !!

#FlashBack Seen !!
శీను (వరుణ్ సందేశ్ ), అవంతిక (నిషా అగర్వాల్ ) ఇద్దరు ఇంజనీరింగ్ కంప్లేతే చేసుకొని ,జాబు కోసం హైద్రాబాద్ వచ్చి USA(United States of Ameerpet) లో కలుస్తారు .
మొదట హాయ్ తో ,తర్వాత చిన్న గొడవ తో మొదలయ్యే వాళ్ళ స్నేహం , అవధులు ధాటి
వాళ్ళు ఇంట్లో చెప్పకుండానే పెళ్లి చేసుకునేల ప్రేరేపిస్తుంది . ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటారో అంతే త్వరగా మన్స్పర్ధలతో , తొందరపాటు నిర్ణయాలు తీసుకుని విడిపోతారు . రెండో పెళ్లికి కూడా సిద్ధమవుతారు .

శీను ,తను పెళ్లి చేసుకునే అమ్మాయితో . అవంతిక తను పెళ్లి చేసుకునే అబ్బాయితో వాళ్ళ ప్రేమ కథ(#FlashBack Seen ) చెప్తూ ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.
సినిమా ఆసాంతం అమీర్ పెట్ లో అమ్మాయిలు , అబ్బాయిలు కలుసుకునే విధానం , ఆకర్షితులై ప్రేమించునే జంటల గురించి , మోసపోయే వనితల గురించి, ఎంత మంది ఆకర్షణ అనే ప్రేమ మత్తులో కురుకు పోతున్నారో చూపించడం. నెట్ రూం రొమాన్స్ , ఫోన్ లో చాటింగ్ , బైకే పైన రైడింగ్ మేలవిస్తూ, శీను అమ్మ పాత్రతో పెద్దలు తమ పిల్లలు ప్రేమించి పెళ్ళిచేసుకుంటే కనుక ఎలా వాళ్ళకి దానిలోని తప్పులు ఒప్పులు తెలియచేసాడు . శీను అవంతిక కాలం కరుగుతున్న కొద్ది తమ తప్పును , తొందరపాటును
తెలుసుకుని చివరికి ఒక్కటి అవ్వటం తో కథ సుఖాంతం అవుతుంది.


Friday, January 14, 2011

పరమ వీరచక్ర :

ధియేటర్ లోకి వెళ్ళగానే డోర్ దగ్గరే "ఈ సినిమా పెద్ద రాడ్ " అని చెప్పారు .
మూడవ రోజు , మూడవ షో .. జనాలు లేరు అంటే ఎవ్వరికైనా అర్ధం అవుతుంది
PVC(పరమ వీరచక్ర) ఎంతటి విజయం సాధించిందో ....

ఇక కథలోకి వెళ్తే !!!!!!!!!!!!!!!!!!!!
NTR బొబ్బిలిపులి తో స్టార్ట్ అవుతుంది , జయసుధ ఏడుస్తుంది . ఎందుకో నేను చూడలేక పోయాను .
దర్శకత్వం దాసరి అనే పేరుతో సగటు అభిమాని ఆశలు ఆవిరి అయ్యే సంగటన వర్ణనాతీతం .
రావణబ్రహ్మ , రాముడితో యుద్ధానికి వెళ్తుంటే , హరితి ఇస్తుండగా దీపం ఆవిరై పోతుంది ...
ఇదంతా చూసి ఏదో ఫాంటసి మూవీ అనుకుంటే పొరపాటు ..
మన బాలయ్య & దాసరి సినిమా లో సినిమా చూపిస్తారు మనకు .
చక్రధర్ (బాలయ్య పేరు ) , వాళ్ళ అమ్మ (జయసుధ ) కి ఇష్టం లేకున్నా సినిమా లు చేస్తుంటాడు .
హీరొయిన్ (షీలా )అవసరం లేకున్నా అప్పుడప్పుడు వచ్చి ఆనందింప చేసి వెళ్తుంది (ఎవ్వరిని ? అని మాత్రం అడగ వద్దు ).
సినిమా ఎటువేల్తుంది రా అనుకునే సమయం లో కొమరం భీమ్(తెలంగాణా యోధుడు ) పాత్రతో చక్రధర్ కి ఇంకో ఆఫర్ వస్తుంది .
ఆయన జీవీత చరిత్ర ఇంకో 15 నిముషాలు . ఏదో సీరియస్ గా వెళ్తున్న మూవీ కి కామన్ సెన్స్ లేని కామెడీ తో సినిమా నే కామెడీ
చేసిన దర్శక రత్న కి జోహార్ ,
మిలటరీ వాళ్ళు చక్రధర్ తో మూవీ తీయాలని ఒక కథతో ముందుకు వస్తారు. కథలో హీరో ఒక మిలటరీ మేజర్ , పేరు జయ సిన్హా (Jay sinha).

Jay Sinha కథ:(flash back)
అలుపురేగని యోధుడు ,ఆమిష పటేల్ మొగుడు , మిలటరీ మేజరు కథలో భాగంగా ఒక సెంట్రల్ మినిస్టర్ నీ కొడతాడు .
జార్కండ్ లో తన కంద బలం చూపు మాజీ మంత్రి కొడుకును అడ్డం వచ్చిన అయ్యాను కొడతాడు .
పై సందర్బం లో కొన్ని బాలయ్య brand డైలాగ్స్ ..
  • నేను యాక్షన్ మొదలు పెడితే , రియాక్షన్ ఇవ్వాలని చూడొద్దు .
  • నన్ను కొడితే చస్తావు , నేను కొడితే చస్తావు .
ఇక ఫైటింగ్ విషయానికి వస్తే , మనుషులతో ఫుట్ బాల్ ఆడుతూ , వాళ్ళని విష్ణు చక్రం ళా తిప్పుతూ
తూపాన్ వస్తే ఎగిరేల కొట్టడం , తంతే సుమో doors విరిగి పడటం ... చెప్పుకుంటూ పోతే చేంతాడు అంత
చెప్తే ఉరేసుకునేంత ... దాచుకుంటే కడుపు మంటలు , చెప్తే వినేవారి తంటాలు .

after flash back:

చక్రధర్ : కథ భాగుంది అని సినిమా తీయటానికి ఒప్పుకుంటాడు .

The Twist(మెలిక ):
జయ సింహ, నిజంగా బ్రతికే ఉన్న ఒక అర్మి మెజార్ , కొందఱు దేశ ద్రోహులు కుట్రలో చిక్కుకుని ఇతను దేశ ద్రోహిగా
ముద్ర పడి, చివరకు ఒక ఎటాక్ లో అందరిని కోల్పోయి , తాను కోమా లో కి వెళ్తాడు .
ఇప్పుడు ఆ దేశాద్రోహులను పట్టుకోవటానికి మన హీరో చక్రధర్ జయ సింహ అవతారం ఎత్తుతాడు .

మల్లి బాలయ్య ఫైట్స్ మొదలు, చివరగా అందరికి తెలిసిన ముగింపు విలన్స్ నీ చంపేసి ,
రెండు బారి డైలాగ్స్ వదిలి , చనిపోయిన జయ సింహ కి పరమ వీర చక్ర బిరుదు ఇచ్చేలా
ప్రభుత్వం నీ వప్పించి .. సెలవు తీసుకుంటాడు ...

Comments: 150 వ సినిమా తీస్తున్న దాసరి కి రాజకీయం దెబ్బకి దర్శకత్వం ఎలా చేయాలో
మరచిపోయాడేమో అనేలా తల తోక లేకుండా , ఆయన మార్క్ ఎక్కడ లేకుండా
అనవసర కామెడీ , లాజిక్ లేని సన్నివేశాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎం చెప్పాలో
తెలియన్తాల తీసాడు ...